Friday 2 March 2012

దేశ వ్యాప్తంగా సుమారు 20 కోట్ల కార్మికవర్గం (సంఘటిత, అసంఘటిత రంగాల) 28-02-2012 ఒక్క రోజు సమ్మెనిర్వహించి ప్రభుత్వ విధానాలకు నిరసన తెలియ జేయడం చారిత్రాత్మకం.
 
ప్రవేటికరణ, కాంట్రాక్టీకరణ విధానాలకు, ధరలపెరుగుదల, నిరుద్యోగం, సామాజిక భద్రత పట్ల అలసత్వం, పెన్షన్ ప్రవేటీకరణ, కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వమొండి వైఖరికి పెల్లుబికిన కార్మిక, ఉద్యోగ వర్గాల నిరసన సమ్మె రూపం లో ప్రభుత్వానికి తెలియజెప్పడం ఒక చారిత్రాత్మక ఉదాహరణ.

కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల పిలుపుకు స్పందనగా సమ్మె లో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీఅభినందనలు. సమ్మెను విజయవంతం చేయడానికి గత నెల రోజుల పైబడి శ్రమించిన వారందరికీ ధన్యవాదములు.ఆంద్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ లో ఒక్క రోజు సమ్మె జరిగిన తీరు అబినందనీయము. సేకరించిన వార్తలను బట్టి సరాసరి 70% మంది పోస్టల్, ఆర్.ఎం.ఎస్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిసినది. సమ్మెలో పాల్గొన్న వారి శాతం 30 నుండి 95 వరకు వున్నది.
కార్మిక వర్గంగా ఉంటూ కార్మిక వర్గ కార్యక్రమాల పట్ల అలసత్వంతో సమ్మె లో పాల్గొనకుండా మిగిలి పోయిన వారు ఆత్మపరిశీలన చేసుకోవలసినది. కారణాలు ఏమైనప్పటికీ అతి తక్కువ శాతం లో సమ్మె నిర్వహించిన డివిజన్, బ్రాంచిలనాయకత్వం సమీక్ష జరుపుకొని తమ భాద్యతలను, పరిస్థితిలను పునః పరిశీలించు కోవలసినది.

No comments:

Post a Comment